సీనియర్‌ సివిల్‌ జడ్జి బదిలీ | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సివిల్‌ జడ్జి బదిలీ

Published Fri, Nov 10 2023 5:18 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి సీనియర్‌ సివిల్‌ జడ్జి, అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి బి.శ్రీదేవి బదిలీ అయ్యారు. ఆమెను హనుమకొండలోని ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తి తన బాధ్యతలను నిజామాబాద్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జీకి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘ధాన్యాన్ని ఎప్పటికప్పుడు

మిల్లులకు తరలించాలి’

కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆదేశించారు. సకాలంలో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 332 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 13,661 మంది రైతుల నుంచి 85,230 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మద్దతు ధర పోస్టర్లను ఆవిష్కరించారు. కొనుగోళ్లకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1967 లేదా 1800 425 00333 నంబర్లకు ఫోన్‌ చేయాలని రైతులకు సూచించారు. సమావేశంలో డీఎస్‌వో మల్లికార్జున్‌బాబు, సివిల్‌ సప్లయ్‌ డీఎం అభిషేక్‌ సింగ్‌, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

‘ఓటు హక్కును

సద్వినియోగం చేసుకోండి’

కామారెడ్డి క్రైం: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. వంద శాతం ఓటింగ్‌ జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ఓటర్లందరు నిష్పక్షపాతంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కొత్త ఓటర్లు ఈనెల 30 న జరిగే పోలింగ్‌లో పాల్గొని తొలి ఓటు అనుభూతిని పొందాలని సూచించారు. ఓటర్లందరికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

కాసుల బాలరాజ్‌కు పరామర్శ

ఖలీల్‌వాడి : బాన్సువాడ శాసనసభకు కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో తీవ్ర మనోవేద నకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రె స్‌ నియోజకవర్గ నాయకులు కాసుల బాలరాజ్‌ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియ ర్‌ నాయకులు. వి హనుమంతరావు చికిత్స పొందుతున్న కాసుల బాలరాజుని పరామర్శించారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో కొట్లాడి సాధించుకోవాలని, కాని ఆత్మహత్యాయ త్నం చేయడం సరికాదన్నారు. ఈసారి టికె ట్‌ రాకుంటే మరోసారి అవకాశం ఉంటుందని, పదవులు శాశ్వతం కాదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ప్రమోద్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల సాధారణ

పరిశీలకుడికి స్వాగతం

కామారెడ్డి క్రైం: ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమితులైన జగదీష గురువారం కామారెడ్డికి వచ్చారు. ఆయనకు కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఉల్లంఘనలపై 91087 15353 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు పరా శివమూర్తి, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్‌ పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement