13,89,291 | Sakshi
Sakshi News home page

13,89,291

Published Fri, Nov 10 2023 5:18 AM

- - Sakshi

నిజామాబాద్‌

ఓటర్లు

సుభాష్‌నగర్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 13వ తేదీ నుంచి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 4 నుంచి 31 వరకు కొత్త ఓటర్ల నమోదు, బదలాయింపునకు ఎన్నికల సంఘం చివరి అవకా శం కల్పించింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 25,133 మంది దరఖాస్తు చేసుకోగా, నవంబర్‌ 10వ తేదీ వరకూ ఫాం.06, 08 దరఖాస్తుల పరిశీల న ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాత ఓటరు స్లి ప్పులను పోలింగ్‌ స్టేషన్ల వారీగా బీఎల్‌ఓల ద్వారా పంపిణీ చేయనున్నారు.

జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో నిజామాబా ద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, బా ల్కొండ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో మొత్తం 1,549 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 13,89,291 మంది ఓటర్లు ఉన్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే పోలింగ్‌ స్టేషన్ల వారీగా బీఎల్‌ఓలకు స్లిప్పులు సరఫరా చేస్తారు. ఆ స్లిప్పులు ఓటర్లకు బీఎల్‌ఓ పంపిణీ చేయనున్నారు. గతంలో పోలింగ్‌ తేదీకి మూడు, నాలుగు రోజుల ముందు ఓటరు స్లిప్పులు పంపిణీ చేసేవారు. ఈ క్రమంలో కొందరు ఓటర్లకు స్లిప్పు లు రాకఓటు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఓటు వేయడాన్ని సులభతరం చేసేందుకు, ఓట్లశాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఈసారి ముందుగానే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

స్లిప్పులో ఏముంటుందంటే..

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 1,549 పోలింగ్‌ కేంద్రాలకుగాను అంతే సంఖ్యలో బీఎల్‌ఓలు ఉంటారు. వారికి ఎన్నికల సంఘం నుంచి వచ్చిన స్లిప్పులను సరఫరా చేయగా, వారు పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఇంటింటికీ తిరిగి స్లిప్పులు పంపిణీ చేస్తారు. ఓటరు స్లిప్పులో పేరు, తండ్రి పేరు, ఓటరు క్రమసంఖ్య, పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌, పోలింగ్‌ తేదీ, గ్రామం, మండలం, నియోజకవర్గం, తదితర వివరాలు పొందుపర్చనున్నారు. ఈ స్లిప్పుల పంపిణీ విధానం ద్వారా పోలింగ్‌ శాతం పెరగడంతోపాటు, సిబ్బందికి, ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తద్వారా ఓటరు నేరుగా సంబంధిత పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లి సులువుగా ఓటేయవచ్చు.

13 నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ

10వ తేదీ వరకూ ఫాం.06, 08 దరఖాస్తుల పరిశీలన

పోలింగ్‌ స్టేషన్ల వారీగా పంపిణీ చేయనున్న బీఎల్‌ఓలు..

1/1

Advertisement
Advertisement