ఎన్నికల అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు | Sakshi
Sakshi News home page

ఎన్నికల అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు

Published Sun, Nov 12 2023 12:36 AM

-

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ అ ర్బన్‌, రూరల్‌ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తమకు నేరుగా ఫిర్యాదు చేయ వచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్‌ సింగ్‌ సూచించా రు. శనివారం ఆయన మాట్లాడు తూ అర్బన్‌, రూరల్‌ సెగ్మెంట్లలో ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. సెలవు రోజులను మినహాయించి మిగితా అన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు తాను జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అందుబాటులో ఉంటానన్నారు. ప్రతిరో జు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు తనను నేరుగా కలిసి ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. 83320 21749లో కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చన్నారు.

కేసుల నమోదుపై అవగాహన

ఖలీల్‌వాడి: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే నమోదు చేసే కేసులపై ఏసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ స్థాయి వరకు అధికారులకు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ సీపీ ఆఫీస్‌కు చెందిన లీగల్‌ అడ్వయిజర్‌ రాము లు అవగాహన కల్పించారు. నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన పోలీసుల కు ఎన్నికల నియమావళిలో భా గంగా నమోదు చేసే కేసుల పై సందేహాలను నివృత్తి చేశారు. వీసీలో సీపీ కల్మేశ్వర్‌, జగిత్యాల ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌, అదనపు డీసీపీ జయ్‌రాం పాల్గొన్నారు.

Advertisement
Advertisement