ధాన్యం ఆరబోస్తే కేసులే! | Sakshi
Sakshi News home page

ధాన్యం ఆరబోస్తే కేసులే!

Published Sun, Nov 12 2023 12:36 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: జిల్లాలో వరి ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు రహదారులను వాడుతున్నారు. దీంతో రాత్రివేళల్లో ధాన్యం కుప్పలు గమనించిన వాహనదారులు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారు. మరికొందరికి కాళ్లు, చేతులు విరిగిపోతున్నాయి. రోడ్లపై ఆరబోసిన ధాన్యం ద్వారా వాహనదారులు మృతి చెందితే ఐపీసీ 304 సెక్షన్‌ ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ కేసుగా పోలీసులు నమోదు చేస్తారు. హత్యా నేరంగా పరిగణిస్తారు. దీనికి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు పలు శిక్షలు పడే అవకాశం ఉంది.

సంవత్సరం మృతుల క్షతగ్రాతుల మొత్తం

సంఖ్య సంఖ్య కేసులు

2021 03 01 04

2022 05 01 06

2023 04 03 05

మూడేళ్లలో 12 మంది మృతి

హత్యానేరంగా పరిగణించి

పదేండ్ల జైలు శిక్ష

(ఈ నెల 3న మోపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాస్బాగ్‌ తాండ వద్ద రోడ్డుపై వరి ధాన్యం ఆరబెట్టడంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న మహిళ ప్రమాదంలో మృతి చెందారు. వరి ధాన్యం ఎండబెట్టిన యాజమాని బాధావత్‌ గణపతి పై అండర్‌ సెక్షన్‌ 304 ఐపీసీ ప్రకారం నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.)

రహదారిపై ధాన్యం ఆరబెట్టొద్దు

రైతులు కోసిన ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టొద్దు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో కొందరు మృతి చెందుతుండగా, మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తాం. రైతులు పోలీస్‌ శాఖకు సహకరించాలి

– కల్మేశ్వర్‌ సింగనవార్‌, పోలీస్‌ కమిషనర్‌, నిజామాబాద్‌

Advertisement
Advertisement