Sakshi News home page

ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి

Published Tue, Nov 28 2023 2:08 AM

బాండ్‌ పేపర్లు చూపుతున్న మదన్‌మోహన్‌ - Sakshi

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగానే ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామనని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్‌మోహన్‌ రావు అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేగా గెలుపొందగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తానని బాండ్‌ పేపర్లు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్నారు. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, స్టోరేజ్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తానన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికి పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతానని చెప్పారు. తనకు వచ్చే జీతంలో ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగితా వేతనాన్ని నిరుపేదల ఇంటి నిర్మాణం కోసం వెచ్చిస్తానన్నారు. కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేయడంతో పాటు, ప్రజల వద్దకు పాలనలో భాగంగా ప్రజలు అధికారుల చుట్టు తిరగకుండా ప్రతి మండలంలో హెల్ప్‌ సెంటర్లు ఏర్పాటు చేసి అధికారులను అక్కడికే తీసుకువచ్చి ప్రజల సమస్యలకు పరిష్కారం జరిగేలా కృషి చేస్తానన్నారు. బోధన్‌ నుంచి బీదర్‌కు వెళ్లే రైలు మార్గం ఎల్లారెడ్డి మీదుగా వెళ్లేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. తాను ఎక్కడికి పోనని స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేస్తానన్నారు. నాయకులు రాంచందర్‌రెడ్డి, నామాల శంకర్‌, సంజీవరెడ్డి, విఠల్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్‌ తదితరులున్నారు.

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement