చేయి చేయి కలిపి మందిర నిర్మాణం | Sakshi
Sakshi News home page

చేయి చేయి కలిపి మందిర నిర్మాణం

Published Wed, Dec 6 2023 1:10 AM

మద్నూర్‌లో నిర్మాణంలో ఉన్న హనుమాన్‌ ఆలయం  - Sakshi

మద్నూర్‌(జుక్కల్‌): గ్రామంలోని వంద సంవత్సరాల నాటి హనుమాన్‌ ఆలయాన్ని పునర్మించాలని భక్తులు సంకల్పించుకున్నారు. దాతలు చేయి చేయి కలపడంతో నూతన ఆలయం నిర్మాణమవుతుండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని గన్‌శెట్టి హనుమాన్‌ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్రితం నుంచి ఇక్కడ చిన్న హనుమాన్‌ ఆలయం ఉంది. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతుండడంతో భక్తుల తాకిడి పెరిగింది. గ్రామంలోని హనుమాన్‌ ఆలయం కోసం దాతలు రూ.30 లక్షల చందా ఇవ్వడంతో నూతన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమై ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడు జనవరి మొదటి వారంలో ఆలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు గంగాధర్‌ తెలిపారు.

వంద సంవత్సరాల నాటి ఆలయం

రూ.30 లక్షలతో పునర్నిర్మాణం

Advertisement
Advertisement