‘బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి’ | Sakshi
Sakshi News home page

‘బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి’

Published Thu, Dec 21 2023 1:12 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర జితేష్‌ వి పాటిల్‌   - Sakshi

కామారెడ్డి క్రైం: రాజకీయ పార్టీలు పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్‌ జాబితాలో మార్పులు, చేర్పులపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పో లింగ్‌ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉ న్న గ్రామాల్లో కొత్తగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పా టు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నా రు. కొన్నిచోట్ల ఒకేచోట మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడినట్లు గుర్తించామన్నారు. వాటిని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫారం–8 ద్వారా బూత్‌ స్థాయి అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. మృతి చెందినవారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటే వారి కుటుంబ సభ్యుల నుంచి వివరణ తీసుకుని తొలగించాలని బీఎల్‌వోలకు సూచించారు. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే వాటిలో ఒక దానిని తొలగించేలా చూడాలన్నారు. నియోజకవర్గాల వారీగా మార్పులు చేయవలసిన పోలింగ్‌ కేంద్రాలపై చర్చించారు. ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరిస్తామని, వారి ఓట్లు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు అనిల్‌ కుమార్‌, పార్టీల ప్రతినిధులు నరేందర్‌, ఖాసీం అలీ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement