‘నారాయణపూర్‌’కు నీటిని విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 10:02 PM

నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు, రైతులు
 - Sakshi

కరీంనగర్‌: ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్‌ నాయకులు, రైతులు నిరసన తెలిపారు. నారాయణపూర్‌, చర్లపల్లి, ఇస్తారుపల్లి, మంగపేటను ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, ఎండి పోయిన పంట పొలాలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో కాంగ్రెస్‌ పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ, ఈ యాసంగిలో నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కింద చొప్పదండి నియోజకవర్గంలోని పలు మండలాల రైతులు వందలాది ఎకరాల్లో వరిపంట సాగుచేయడం జరిగిందన్నారు. సాగునీరు విడుదల చేస్తామంటూ ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో రైతాంగం కూడా వరి సాగుకు మొగ్గు చూపారని, తక్షణమే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్‌కు నీటిని విడుదల చేసి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల అధ్యక్షులు పురుమల్ల మనోహర్‌, ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మరవేణి తిరుపతి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, ఎంనీటీసీ జావ్వాజి హరీశ్‌, కిషన్‌ సెల్‌ అధ్యక్షుడు బుర్గు గంగన్న, బట్టు లచ్చన్న, ముత్యం శంకర్‌, రాయమల్లు, పంజాల శ్రీనివాస్‌, జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి, రాజేశం, అశోక్‌, తోట కరుణాకర్‌, మల్లేశం, కోల ప్రభాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, మహేష్‌, గాజుల అజయ్‌, దిలీప్‌, భువన్‌కూమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement