ఆవిర్భావ వేడుకలు | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలు

Published Tue, May 9 2023 12:28 AM

- - Sakshi

మానకొండూర్‌: సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడసంక్షేమ సంఘం ఆవిర్భావ వేడుకలు కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు కత్తి ప్రభాకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మానకొండూరులో ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ... సర్వాయి పాపన్న మోకు దెబ్బ గీతకార్మికుల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌గౌడ్‌, జిల్లా మహిళా కన్వీనర్‌ బత్తిని వినోద్‌గౌడ్‌, మా నకొండూరు మండల అధ్యక్షుడు శశివర్ధన్‌గౌడ్‌ మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, ఏగోలపు సంతోష్‌ గౌడ్‌ గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

మానకొండూర్‌: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని అరెస్టు చేసినట్లు మానకొండూరు సీఐ మా దాసు రాజకుమార్‌ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మానకొండూ రు చెరువు కట్టవద్ద అనుమానాస్పదంగా ఓ వ్య క్తి తిరుగుతున్నాడని, స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి తనిఖీచేయగా, అత ని వద్ద గంజాయి ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. వరంగల్‌ జిల్లా గిర్మాజిపేటకు చెందిన జగదీశ్‌గా గుర్తించామన్నారు. అనంతరం తహ సీల్దార్‌ లక్ష్మారెడ్డికి సమాచారం ఇవ్వగా తహసీల్దార్‌ విచారణ చేసి అతని వద్దనుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత డిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

వృద్ధుడి ఆత్మహత్య

గన్నేరువరం: మండలంలోని మాదాపూర్‌ గ్రా మంలో వృద్ధుడు బైరి భూపతిరెడ్డి(72) ఆదివా రం ఉరేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. పోలీ సులు, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. మృతుడి భార్య వజ్రమ్మ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. జీవితంపై వి రక్తితో తన పొలంలోని మామిడిచెట్టుకు ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యుల ఫిర్యాదుచేశారు.సోమవారం కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారు లు రమణారెడ్డి, రాజేందర్‌రెడ్డి ఉన్నారు.

యువకుడి అదృశ్యం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమా ల గ్రామానికి చెందిన ఉల్లి మహేశ్‌ (26) అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాలు.. మహేశ్‌ రెండు రో జులుగా కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరుడు అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ చూకీ తెలిసిన వారు 75696 95672, 94419 67358 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1/2

2/2

Advertisement
Advertisement