కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం | Deepthi Death Case: Police Issued Look Out Notice On Chandana - Sakshi
Sakshi News home page

కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం.. చెల్లి చందనపై లుక్‌ అవుట్‌ నోటీస్‌!

Published Fri, Sep 1 2023 2:26 AM

- - Sakshi

కోరుట్ల: బంక దీప్తి అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా భావిస్తున్న చెల్లెలు చందనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కోరుట్లలోని తన ఇంట్లో మంగళవారం మ ధ్యాహ్నం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బంక దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీప్తి చనిపోవడం, ఆమె చెల్లెలు చందన కనిపించకపోవడంతో ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి పరారైనట్లు పోలీసులు అనుమానించారు.

ఈ క్రమంలో ఆమె ఆ చూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. చందన ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయంలో రూ. 2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే కిలోన్న ర బంగారు నగలు, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. చందన బాయ్‌ఫ్రెండ్‌ హైదరాబాదీగా పోలీసులు గుర్తించిన ట్లు తెలిసింది. చందన ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా బాయ్‌ ఫ్రెండ్‌ వి వరాలు పోలీసులు సేకరించారు. ఇద్దరి సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ ఉండటంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. దీప్తి, చందనలకు మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. హైదరాబాద్‌ బాయ్‌ ఫ్రెండ్‌ తీసుకుని వచ్చాడా? లేక స్థానికంగా ఉన్న ఎవరైనా కొనుక్కుని తెచ్చారా? అన్న విషయం తేలలేదు.

కోరుట్లలో ఉన్న వైన్‌షాపుల వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించినప్పటికీ సోమవారం సాయంత్రం రెండు, మూడుసార్లు విద్యుత్‌ సరాఫరా లో అంతరాయం కలగడంతో సీసీ కెమెరాల్లో ఎలాంటి రికార్డులు లేనట్లు తెలిసింది. ఇప్పటికే కోరుట్ల సర్కిల్‌లోని ఇద్దరు ఎస్సైలు తమ బృందాలతో క లిసి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ కోసం హైదరాబాద్‌లో గాలింపులు చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్‌ సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డు కేవైసీ అడ్రస్‌ ప్రకారం వెతకగా అక్కడ ఎవరి ఆచూకీ దొరకలేదని సమాచారం. చందన పాస్‌పోర్టును వెంట తీసుకెళ్లడం, డబ్బులు, బంగారం వెంట ఉండటంతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి విదేశాలకు పరారవుతారన్న సందేహాలతో ఎయిర్‌పోర్ట్‌లకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తె లిసింది. చందన బీటెక్‌ రెండో సంవత్సరంలోనే డిటెయిన్‌ అయినట్లు సమాచారం.

ఈ విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టి హైదరాబాద్‌లో రెండేళ్లు బీటెక్‌ చేస్తున్నట్లుగా ఇంట్లో వారిని నమ్మించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా పుకార్లు రావడం కలకలం రేపింది. ఈ విషయమై కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా చందన కోసం రెండు పోలీసు బృందాల గాలింపులు కొనసాగిస్తున్నాయని ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

Advertisement
Advertisement