నిరుద్యోగులను విస్మరించిన బీఆర్‌ఎస్‌ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను విస్మరించిన బీఆర్‌ఎస్‌

Published Fri, Oct 13 2023 1:38 AM

మాట్లాడుతున్న వెంకటేశ్‌ - Sakshi

హుజూరాబాద్‌: విద్యార్థి, నిరుద్యోగులను విస్మరించిన బీఆర్‌ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌లోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాముయాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. హు జూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అనేకహామీలు ఇచ్చారని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోవడంతో ఏ హామీ నెరవేర్చాలేదని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవ ని, బీసీ సంక్షేమ హాస్టళ్లు, బాలికల హాస్టల్‌ శిథిలావస్థలో ఉన్నాయని వాటికి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి విద్యార్థి, నిరుద్యోగులు సిద్ధం కావాలని కోరారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ హుజూ రాబాద్‌ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దోమ్మటి వేణుగోపాల్‌, కార్యదర్శిగా జూపాక శివమణి, ఉపాధ్యక్షుడిగా గూండ వరుణ్‌తేజ్‌, సహాయ కార్యదర్శి రాంపెల్లి రోహిత్‌, కోశాధికారిగా ముదిగంటి నాగేందర్‌, సభ్యులుగా భాస్కర్‌, మధుమోహన్‌రెడ్డి, శ్రీచరణ్‌, విజయ్‌, శ్రీకాంత్‌, బాలు, వరుణ్‌, అభినయ్‌ ఎన్నికయ్యారు.

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్‌

Advertisement
Advertisement