మానసిక ప్రశాంతతకు మాలధారణ | Sakshi
Sakshi News home page

మానసిక ప్రశాంతతకు మాలధారణ

Published Sat, Oct 21 2023 12:53 AM

అమ్మవారి సన్నిధిలో దీక్షాపరులు  - Sakshi

ఆధ్యాత్మిక చింతనలో యువత

సనాతన ధర్మం వైపు అడుగులు

కరీంనగర్‌కల్చరల్‌: ప్రస్తుత ఆధునిక యుగంలో యువత స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టిక్‌టాక్‌ వీడియోలు, ఇన్‌స్ర్ట్రాగామ్‌, పార్టీలు, సరదాలతో ఎల్ల్లప్పుడూ గడిపేస్తున్నారు. కానీ రానురాను వారి ఆలోచనల్లో మార్పు వస్తోంది. వారిలో దైవచింతన రోజురోజుకు పెరుగుతోంది. సనాతన ధర్మంవైపు అడుగులు వేస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎక్కువ మంది యువకులు భక్తిభావంతో భవానీ దీక్షలు చేపట్టారు. ఆధ్యాత్మికభావంతో పాటు మానసిక ప్రశాంతత ఉంటుందని భవానీ దీక్ష చేపట్టిన యువత తమ మనోభావాలను సాక్షితో పంచుకున్నారు.

రెండోసారి దీక్ష

నేను రెండో సారి భావానీ దీక్ష స్వీకరించ. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి దీక్ష చేపట్టడంతో మానసికంగా ప్రశాంతంతో పాటు ఆధ్యాత్మికత భావన పెంపొందుతుంది.

– అజయ్‌, కరీంనగర్‌

మానసిక ప్రశాంతత కోసం..

అమ్మవారి సన్నిధిలో మనసుకు ప్రశాంతత ఉండాలని మాలధారణ చేపట్టా, దీక్ష తీసుకున్న తర్వాత నాలో భక్తితోపాటు మానసిక ప్రశాంతం, దైవంపై ఇష్టం పెరిగింది.

– పవన్‌, మొగ్ధుంపూర్‌

అమ్మవారి సన్నిఽధిలో..

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజల పాటు అమ్మవారి సన్నిధిలో గడపడం నాకు ఇష్టం, అందుకే ప్రతిసారి భవానీ మాలధారణ స్వీకరిస్తా. దైవసన్నిధిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. – అనిల్‌, కరీంనగర్‌

భక్తి భావంతో..

గతేడు కోరిక నేరవేరడంతో ఈసారి అమ్మవారి మాలధారణఽ ధరించా. తొమ్మిది రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండటంతో ఎంతో మానసిక ప్రశాంతంగా ఉంటుంది.

– సాయి, కరీంనగర్‌

మొదటి సారి మాలధారణ

మా స్నేహితులందరం కలసి దుర్గామాతను ప్రతిష్టించాం. ప్రతిరోజూ అమ్మవారికి నిష్టతో పూజలు చేయాలని అమ్మవారి అనుగ్రహణం పొందాలని మాలధారణ చేసుకున్నా.

– పరమేశ్‌, మొగ్దుంపూర్‌

మనస్సుకు ఆనందంగా..

భవానీ మాలధారణ తీసుకోవడం అమ్మవారి చింతనలో గడపడం మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది. నియమనిష్టలతో కూడిన దీక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. అమ్మవారి చల్లని చూపు మాపై ఉంటుందని నమ్మకం. – అన్వేష్‌, కరీంనగర్‌

1/6

2/6

3/6

4/6

5/6

6/6

Advertisement
Advertisement