Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు 2023: మీకు తెలుసా..? నామినేషన్లపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు!

Published Sat, Nov 4 2023 1:40 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ ఘట్టం ప్రారంభమైంది. అయితే ఇందులో సామాన్యులూ ఎన్నికల క్రతువులో భాగం కావొచ్చు. అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయంలో తమ విద్య, వ్యాపారం, ఆస్తులు, అప్పులు, నేరచరిత, వారసత్వ సంపదను వారి అఫిడవిట్‌లో పొందుపరచాలి. దీన్ని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. కానీ, కొందరు తమ వివరాలను తప్పుగా చూపే అవకాశం కూడా ఉంది.

అలా అభ్యర్థులు సమర్పించిన వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే, లేదంటే నామినేషన్‌ వేసిన వాళ్లపై ఏమైనా ఫిర్యాదులు ఎవరైనా చేయొచ్చు. ఈ విషయం మీకు తెలుసా?. 

నామినేషన్‌ వేసిన అభ్యర్థులపై నేరుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికే ఫిర్యాదు చేయొచ్చు. అభ్యర్థి తన నామినేషన్‌ పత్రాన్ని సంబంధిత అధికారికి అందించిన వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అనంతరం ఆ కార్యాలయ నోటీస్‌ బోర్డుపై అభ్యర్థుల అఫిడవిట్‌ ఉంచుతారు. వీటిని ఎవరైనా పరిశీలించి, సమాచారం తప్పుగా ఉన్నట్లు తెలిస్తే అభ్యంతరాలపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు.

:::ఓటు అనేది ప్రతీపౌరుడి హక్కు. మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే.. హిల్లరీ క్లింటన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement