ఆ పల్లెలు.. | Sakshi
Sakshi News home page

ఆ పల్లెలు..

Published Sun, Nov 5 2023 12:48 AM

- - Sakshi

నేతలకు పుట్టిల్లు
● చట్టసభలకు ఎన్నికై న పలువురు ఉమ్మడి జిల్లావాసులు ● అధ్యక్షా.. అంటూ ప్రజాసమస్యలపై గళం
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఆ గ్రామాలు కీలక నేతలకు పుట్టిల్లు. చట్టసభల్లో అధ్యక్షా.. అంటూ ప్రజాసమస్యలపై గళం విప్పారు. వీరిలో సీఎం కేసీఆర్‌ నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సదరు పల్లెలపై వివరాలతో కథనం.

కరీంనగర్‌ అర్బన్‌:

తెలంగాణ ఉద్యమ సారథి సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ము స్తాబాద్‌ మండలం మోహినికుంట. కేసీఆర్‌ తండ్రి కల్వకుంట్ల రాఘవరావు ఇక్కడే జన్మించారు. ఆయనకు ముగ్గురు అన్నలు జగ్గారావు, నారా యణరావు, నర్సింగరావు. అందరికంటే చిన్నవాడు రాఘవరావు. వ్యవసాయం చేసుకునేవా రు. 1948 ప్రాంతంలో పోశాన్‌పల్లి వద్ద ఎగువమానేరు ప్రాజెక్టు నిర్మించడంతో అప్పటి నిజాం ప్రభుత్వం నిర్వాసితులకు సిద్దిపేట జిల్లా చింతమడకలో పునరావాసం కల్పించింది. మంత్రి కేటీఆర్‌ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే మోహినికుంట ఉంది. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి ముస్తాబాద్‌ మండలంలోని నామాపూర్‌ ఆడపడుచు.

కోనరావుపేట.. ఐదుగురు ఎమ్మెల్యేలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల మండలం కోనరావుపేటనుంచి ఐదుగురు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాగారానికి చెందిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయన సోదరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు చొప్పదండి నుంచి ఒకసారి, సిరిసిల్ల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతని కుమారుడు రమేశ్‌బాబు వేములవాడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే, మల్కపేటకు చెందిన చల్మెడ ఆనందరావు కరీంనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే గ్రామానికి చెందిన కర్రోల్ల నర్సయ్య తెలంగాణ సమరయోధుడు కాగా 1957లో సిరిసిల్ల ఉమ్మడి నియోజకవర్గం నుంచి పీడీఎఫ్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

ధర్మపురి నియోజకవర్గం నుంచి ఆరుగురు

1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన నలుగురు ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. జగిత్యాల నుంచి టి.జీవన్‌రెడ్డి, బుగ్గారం నుంచి జువ్వాడి రత్నాకర్‌రావు, పెద్దపల్లి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్‌ నుంచి కటారి దేవేందర్‌రావు శాసనసభకు ఎన్నికయ్యారు. ధర్మారం మండలంలోని కమ్మరిఖాన్‌పేట గుజ్జుల రామకృష్ణారెడ్డి స్వస్థలం. కటారి దేవేందర్‌రావుది గొల్లపల్లి మండలంలోని చెందోళి. జీవన్‌రెడ్డిది పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామం. జువ్వాడి రత్నాకర్‌రావుది ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్‌. ఇదే గ్రామానికి చెందిన నారాయణరావు హైదరాబాద్‌లో స్థిరపడగా అక్కడి మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి 1985లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వెల్గటూర్‌కు చెందిన సాన మారుతి 2004లో చొప్పదండి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నేతలకు కేరాఫ్‌.. 14వ డివిజన్‌

కరీంనగర్‌లోని 14వ డివిజన్‌ రాజకీయ నేతలకు కేరాఫ్‌గా మారింది. వెల్గటూర్‌ మండలంలోని పైడిపెల్లి మంత్రి గంగుల కమలాకర్‌ స్వస్థలం. వరుసగా మూడుసార్లు కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందగా మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా నాలుగోసారి పోటీలో ఉన్నారు. సి.ఆనందరావు 1985లో, జువ్వాడి చంద్రశేఖర్‌రావు 1994లో, దేవేందర్‌రావు 1999లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చెన్నమనేని విద్యాసాగర్‌రావు 14వ డివిజన్‌లోనే ఇంటిని కొనుగోలు చేసి, ఇక్కడి నుంచే ఎంపీగా విజయం సాధించారు.

సీహెచ్‌. రాజేశ్వర్‌రావు

జువ్వాడి చంద్రశేఖర్‌రావు

సాన మారుతి

అంతర్గాం.. స్థానికం నుంచి చట్టసభలకు

జగిత్యాల పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే అంతర్గాం గ్రామానికి ఓ చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన పలువురు స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అనేక పదవుల్లో ఉన్నారు. 1957లో గ్రామానికి చెందిన మాకునూరి శ్రీరంగరావు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి, కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. వీరి కుటుంబం నుంచే 1962లో ధర్మారావు స్వతంత్ర అభ్యర్థిగా జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో జి.రాజేశంగౌడ్‌ టీడీపీ తరఫున పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచి, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా పని చేశా రు. 1987లో అంతర్గాం సర్పంచ్‌గా పని చేస్తున్న సుద్దాల దేవ య్య నేరెళ్ల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగానూ పని చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఈ గ్రామవాసే.

1/14

రామకృష్ణారెడ్డి
2/14

రామకృష్ణారెడ్డి

సుద్దాల దేవయ్య
3/14

సుద్దాల దేవయ్య

4/14

5/14

6/14

చల్మెడ ఆనందరావు
7/14

చల్మెడ ఆనందరావు

కేసీఆర్‌
8/14

కేసీఆర్‌

కమలాకర్‌
9/14

కమలాకర్‌

10/14

11/14

12/14

13/14

కటారి దేవేందర్‌రావు
14/14

కటారి దేవేందర్‌రావు

Advertisement
Advertisement