పార్టీల జెండాల తయారీపై నిఘా | Sakshi
Sakshi News home page

పార్టీల జెండాల తయారీపై నిఘా

Published Sat, Nov 11 2023 12:50 AM

-

సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా.. సిరిసిల్లలో తయారయ్యే వివిధ రాజకీయ పార్టీల జెండాలు, కండువాలపై ఎన్నికల కమిషన్‌ నిఘా వేసింది. సిరిసిల్లతోపాటు హైదరాబాద్‌లోని జెండాలు, కండువాలు, టోపీల తయారీ కేంద్రాల్లో రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు. ఏ రాజకీయపార్టీ అభ్యర్థులు ఎన్ని జెండాలు.. ఎన్ని కండువాలు, ఎన్ని టోపీలకు ఆర్డ ర్లు ఇచ్చారో.. అంత మేరకు బిల్లులు ఇవ్వాలని అధి కారులు ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో ప్రచార సామగ్రిని సరఫరా చేసి, తక్కువ సంఖ్యలో బిల్లులు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ అధికా రుల బృందం సైతం సిరిసిల్ల వస్త్రవ్యాపారులు సరఫరా చేసే తెల్లని పాలిస్టర్‌ బట్టకు జీఎస్టీ చెల్లిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వస్త్రవ్యాపారి ధ్యావనపల్లి మురళికి చెందిన గోదాముల్లో తనిఖీలు చేసి ఈమేరకు అధికారులు ఆరా తీశారు. ఉత్పత్తి అవుతున్న జెండాలు, కండువాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ అధికారులు, జీఎస్టీ అధికారులు సిరిసిల్ల, హైదరాబాద్‌లలో తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement