సింగరేణి కార్మికుడి దుర్మరణం | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుడి దుర్మరణం

Published Sat, Nov 11 2023 12:50 AM

గాయపడిన లత
 - Sakshi

కమాన్‌పూర్‌(మంథని): స్థానిక పిల్లపల్లె వద్ద గురువారం సాయంత్రం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో గుండారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు లక్కాకుల శ్రీనివాస్‌(55) శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రావణ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. శ్రీనివాస్‌ కమాన్‌పూర్‌ నుంచి గుండారం వస్తుండగా మసీదులో మౌలానా పనిచేస్తున్న రహ్మత్‌ అలీ గుండారం నుంచి కమాన్‌పూర్‌ వెళ్తున్నాడు. ఈక్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో శ్రీనివాస్‌ తలకు తీవ్రగాయాలు కాగా 108 వాహనాంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీరలించారు. పరిస్థితి విషమంగా ఉండంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ శ్రీనివాస్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు శ్రావణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రాములు కేసు నమోదు చేసుకున్నారు.

తమ్ముడి భార్యపై గొడ్డలితో దాడి

కొండగట్టు(చొప్పదండి): భూతగదాల నేపథ్యంలో సొంత తమ్ముడి భార్యపై అన్న దాడి చేసిన సంఘటన కొడిమ్యాల మండలం రాంసాగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవీందర్‌రావు, సత్యంరావు అన్నదమ్ములు. కొన్ని సంవత్సరాల క్రితం సత్యంరావు మృతిచెందగా.. అతడి భార్య లత, అన్న రవీందర్‌రావు మధ్య భూతగదాలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో శుక్రవారం పొలం వద్ద జరిగిన గొడవల్లో రవీందర్‌రావు, అతడి కుమారుడు రామేశ్వర్‌రావు లతపై గొడ్డలితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన లతను కుటుంబ సభ్యులు జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. లత కొండగట్టు ఆలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

  శ్రీనివాస్‌ (ఫైల్‌)
1/1

శ్రీనివాస్‌ (ఫైల్‌)

Advertisement
Advertisement