ఘనంగా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు | Sakshi
Sakshi News home page

ఘనంగా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు

Published Sat, Nov 18 2023 1:38 AM

కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్న మేయర్‌, నాయకులు - Sakshi

కరీంనగర్‌: మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి,, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కెప్టె న్‌ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలను శుక్రవారం బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అమరావతి సలీం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణచౌక్‌లో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మేయర్‌ సునీల్‌రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌లు హా జరై కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థి చదువుకు కరీంనగర్‌కు చెందిన సైహా న్‌సింగ్‌కు అమరావతి సలీం అందించిన ఆర్థిక సాయం రూ.51,000ల చెక్కును అందజేశారు. ప్రధాన ఆస్పత్రిలో రోగులకు దుప్పట్లు పంపి ణీ చేశారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌రావు, కార్పొరేటర్లు అశోక్‌రావు, సరిల్ల ప్రసాద్‌తో పా టు మహేందర్‌, మహమూద్‌, రాజు, మోనిత స్టాలిన్‌, చిన్న, గుండ గుణనిధి, కె. ధర్మేందర్‌, ఇలియాస్‌, శివదీప్‌, ప్రద్యూమ్‌ పాల్గొన్నారు.

ఉచిత కుట్టు శిక్షణకు

దరఖాస్తు చేసుకోండి

మానకొండూర్‌రూరల్‌: అభయ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మండలంలోని లింగాపూర్‌ గ్రామంలో ఉచిత కుట్టుశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ అరుణప్రభంజన్‌ తెలిపారు. ఔత్సాహికులు 9640789108 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇప్పటివరకు మండలంలోని వివిధ గ్రామాల్లో కుట్టుశిక్షణ తరగతులు నిర్వహించి 200 మందికి కుట్టుయంతారలు పంపిణీ చేశామన్నారు. అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement