త్యాగాలు ప్రజలవి..భోగాలు కేసీఆర్‌వి | Sakshi
Sakshi News home page

త్యాగాలు ప్రజలవి..భోగాలు కేసీఆర్‌వి

Published Mon, Nov 20 2023 11:42 PM

సభలో మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి
 - Sakshi

సిరిసిల్లటౌన్‌: ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసింది ప్రజల వంతైంది.. స్వరాష్ట్రంలో భోగాలు కేసీఆర్‌కు దక్కాయని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్ల పద్మశాలి కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన సీపీఐ జనరల్‌ బాడీ సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర దశ..దిశ మార్చేటివి అన్నారు. గతంలోని ప్రభుత్వాలు కట్టిన నాగార్జునసాగర్‌ తదితర ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, కేసీఆర్‌ హయాంలో ఇటీవలే నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సీపీఐ నాయకులు సామల మల్లేశం, వెంకటస్వామి, పంతం రవి, కాంగ్రెస్‌ నాయకులు చక్రధర్‌రెడ్డి, నాగుల సత్యనారాయణగౌడ్‌, ఎల్లె లక్ష్మి నారాయణ, గోలి వెంకటరమణ, గోనె ఎల్లప్ప పాల్గొన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల పాలైంది

వేములవాడ: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరలపాలైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, తెచ్చుకున్న స్వరాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుకుంటూ, దొరల నుంచి విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

పదేళ్లలో అంతులేని అవినీతి

ఇవి తెలంగాణ దశ..దిశ మార్చే ఎన్నికలు

సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

Advertisement
Advertisement