‘కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనం’ | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనం’

Published Mon, Nov 20 2023 11:42 PM

మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి - Sakshi

జగిత్యాలటౌన్‌: దేశంలో సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేసిన ఇందిరా గాంధీపై సీఎం కేసీఆర్‌ విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ఇందిరమ్మ రాజ్యమా.. తోకమట్టానా..’ అని మాట్లాడడాన్ని ఖండించారు. ఓటమి భయంతో కేసీఆర్‌ విచక్షణ మరిచిపోయి మాట్లాడుతున్నారని తెలిపారు. భూసంస్కరణలు చేపట్టి పేదలకు మిగులు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదని గుర్తుచేశారు. కేసీఆర్‌ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్‌ పార్టీలోనే అన్న విషయం మరువరాదని సూచించారు. ఆయన వెంట గిరి నాగభూషణం, బండ శంకర్‌, గాజంగి నందయ్య, కల్లెపెల్లి దుర్గయ్య, పుప్పాల అశోక్‌, జున్ను రాజేందర్‌, చందా రాధాకిషన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement