ఎయిడ్స్‌కు నివారణ ఒక్కటే మార్గం | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌కు నివారణ ఒక్కటే మార్గం

Published Sat, Nov 25 2023 1:00 AM

మాట్లాడుతున్న ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయలక్ష్మి - Sakshi

కరీంనగర్‌ సిటీ: ఎయిడ్స్‌కు నివారణ ఒక్కటే మార్గమని టీఐఎన్‌జీవో ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. డిసెంబర్‌ 1వ తేదీ వరల్డ్‌ ఎయిడ్స్‌ డే పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎం.సంపత్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ టి.లావణ్య, టీఐఎన్‌జీవో ప్రాజెక్టు మేనేజర్‌ మహిపాల్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మీ విద్యార్థులకు హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ వ్యాప్తికి కారణాలు, నివారణ చర్యలు వివరించారు. సమాజంలో ఎయిడ్స్‌ వ్యాప్తి, హెచ్‌ఐవీ పాజిటివ్‌ సోకిన వారికి సరైన వైద్య పరీక్షలు అవసరమైన మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఏఆర్‌టీ కౌన్సెలర్‌ ద్వారా వారికి మనోధైర్యాన్ని అందించవచ్చని అన్నారు. ఎన్‌ఏసీవో, టీఎస్‌ఏసీఎస్‌ 2023 సంవత్సరం లేట్‌ కమ్యూనికేట్‌ లీడ్‌ నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వీటితో పాటు హెచ్‌ఐవీ వ్యాధి, నివారణ మార్గాలను సూచిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుజాత, అరుణ, స్వప్న, వనిత మైత్రి పబ్లిక్‌ వెల్ఫేర్‌ సొసైటీకి చెందిన సురేశ్‌, భాగ్యలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement