ఇంటర్‌నేషనల్‌ సాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో శంకర్‌ శిల్పం | Sakshi
Sakshi News home page

ఇంటర్‌నేషనల్‌ సాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో శంకర్‌ శిల్పం

Published Sat, Dec 2 2023 1:08 AM

శంకర్‌ రూపొందించిన సద్దుల బతుకమ్మ సైకత శిల్పం - Sakshi

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌కు చెందిన సైకత శిల్పి రేవెల్లి శంకర్‌కు ఒడిస్సా రాష్ట్ర టూరిజం శాఖ నిర్వహించే ఇంటర్‌ నేషనల్‌ సాండ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఇందులో భాగంగా శుక్రవారం కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ విభాగంలో తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ వేడుక ఉట్టిపడేట్లు సైకత శిల్పాన్ని శంకర్‌ రూపొందించి అభినందనలు అందుకున్నారు.

నేడు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 జిల్లాస్థాయి సెలక్షన్స్‌

కరీంనగర్‌స్పోర్ట్స్‌: నగరంలోని అంబేడ్కర్‌ స్టేడియంలో శనివారం పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్‌–14 బాలబాలికల ఖోఖో సెలక్షన్స్‌, అండర్‌–14, 17 బాలబాలికల బాస్కెట్‌బాల్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ పి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 10 గంటల వరకు హాజరుకావాలని సూచించారు. ఫొటోతో కూడిన ఎలిజిబులిటీ సర్టిఫికెట్‌, ఆ ఫొటోపై హెడ్మాస్టర్‌ సంతకం ఉండాలని, స్టడీ సర్టిఫికెట్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికేట్‌, ఆధార్‌కార్డు జిరాక్స్‌ తీసుకొని రావాలని పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు ఈనెల 4న పెద్దపల్లిలో జరిగే అండర్‌–14 ఖోఖో బాలబాలికల ఉమ్మడి జిల్లాస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొంటారని తెలిపారు.

పేదకుటుంబానికి

ఆర్థిక సాయం

జమ్మికుంట: మండలంలోని కోరపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన నూతికాడి విజయ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు. రూ.16 వేలు సేకరించి శుక్రవారం రాత్రి అందజేశారు. ఈసందర్భంగా విజయ ఆర్థికసా యం చేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యువకులు మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

1/1

Advertisement
Advertisement