కరీంనగర్‌ మండలంలో 74శాతం పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ మండలంలో 74శాతం పోలింగ్‌

Published Sat, Dec 2 2023 1:08 AM

-

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలంలో గురువా రం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.91శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లు, పోలింగ్‌స్టేషన్ల వారీగా పోలైన ఓట్ల వివరాలను మండల తహసీల్దార్‌, ఎన్నికల సహాయ అధికారి నవీన్‌ శుక్రవా రం ప్రకటించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో మొత్తం 390 పోలింగ్‌ కేంద్రాలుండగా.. కరీంనగర్‌ మండల పరిధిలో పోలింగ్‌ కేంద్రం 62 నుంచి 127 వరకు మొత్తం 69 కేంద్రాలున్నాయి. మండలంలోని 17 గ్రామపంచాయతీలతో పాటు కార్పొరేషన్‌లో విలీనమైన ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహా డ్‌ పరిధిలో మొత్తం ఓట్లు 53,802 కాగా పురుషులు 26,619, మహిళలు 27,181, థర్డ్‌జెండర్‌ 2 ఉన్నా రు. గురువారం నిర్వహించిన పోలింగ్‌లో మొత్తం 40,303 ఓట్లు పోల్‌ కాగా పురుషులు 20,167, మ హిళలు 20,135 మంది, నగునూరులో థర్డ్‌జెండర్‌ వైష్ణవి ఉన్నారు. అత్యధికంగా నల్లగుంటపల్లి పోలింగ్‌ కేంద్రంలో 467 మంది ఓటర్లకు 430 మంది ఓట్లు వేయగా 92.08శాతం నమోదైంది. అదేవిధంగా తాహెర్‌కొండాపూర్‌ పోలింగ్‌ కేంద్రం 95లో 432 మంది ఓట్లకు 393 పోల్‌ కావడంతో 90.97శాతంగా నమోదైంది. అత్యంత తక్కువగా గుంటూరుపల్లిలోని పోలింగ్‌ కేంద్రం 125లో 739 ఓట్లకు 272 ఓట్లతో 36.81శాతం, పోలింగ్‌ కేంద్రం 126లో 904 ఓట్లకు 148 ఓట్లు పోల్‌ కాగా 16.37శాతంగా నమోదైంది. అయితే గుంటూరుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఈ పోలింగ్‌ కేంద్రాలకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రజ్వీచమన్‌, సిటిజన్‌కాలనీ, ప్రియదర్శినీకాలనీ, శ్రీపురం కాలనీ, సెల్ఫీ నగర్‌ కాలనీవాసుల ఓట్లున్నాయి. అయితే ఆయా కాలనీలు దూరంగా ఉండటంతో ఓటేసేందుకు ఆసక్తి చూపించలేదు. అంతేకాకుండా పలువురు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌దేశాలకు వలసవెళ్లారు.

అత్యధికంగా నల్లగుంటపల్లి

అత్యల్పంగా గుంటూరుపల్లిలో నమోదు

Advertisement
Advertisement