మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయాలి | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయాలి

Published Tue, Dec 5 2023 5:00 AM

సమీక్ష నిర్వహిస్తున్న ఎస్‌ఈ గంగాధర్‌ - Sakshi

టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ గంగాధర్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ ఆదేశించారు. కరీంనగర్‌ విద్యుత్‌ భవన్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఇంజినీరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పాట్‌ బిల్లింగ్‌, డీలిస్టు ఆపరేషన్‌, వర్క్‌ ఆర్డర్స్‌ క్లోజింగ్‌, లింకింగ్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ టు డొమెస్టిక్‌, విద్యుత్‌ సరఫరా, డీటీఆర్‌ల ఫెయిల్యూర్‌, టీఎస్‌ఐపాస్‌, వ్యవసాయ విద్యుత్‌ సరఫరా అంశాలపై కరీంనగర్‌ రూరల్‌, టౌన్‌, హుజూరాబాద్‌ డివిజన్ల అధికారులతో చర్చించారు. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఏవో ఎ.రాజేశం, డీఈలు చంద్రమౌళి, జె.రాజం, ఎం.తిరుపతి, లక్ష్మారెడ్డి, కాళిదాసు, ఏడీఈలు నరేందర్‌, సుధీర్‌కుమార్‌, అంజయ్య, సత్యనారాయణ, కిరణ్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, లావణ్య, స్వప్న, ప్రశాంత, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement