నేల ఆరోగ్యాన్ని కాపాడటం బాధ్యత | Sakshi
Sakshi News home page

నేల ఆరోగ్యాన్ని కాపాడటం బాధ్యత

Published Wed, Dec 6 2023 12:12 AM

ప్రతిజ్ఞ చేస్తున్న అతిథులు, శాస్త్రవేత్తలు - Sakshi

జమ్మికుంట(హుజూరాబాద్‌): వాతావరణంలోని మార్పులను గమనించి, నేల ఆరోగ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ మాజీ సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ చేరాలు, జమ్మికుంట వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, కేవీకే ప్రధాన కార్యదర్శి విజయ్‌గోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం)లో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆరోగ్యం బాగుంటుందని, తద్వారా దేశ భవిషత్‌ను కాపాడగలుగుతామని తెలిపారు. యువత సేంద్రియ విధానాలు అవలంబించి, సహజ వనరులను కాపాడేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యవసాయంలో భాగంగా నేలలోని కర్బన శాతాన్ని ఏవిధంగా పెంచాలి, పెంచడం వల్ల కలిగే లాభా లను వివరించారు. ప్రతీ ఒక్కరు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలన్నారు. అనంతరం నేల ఆరోగ్యం కాపాడాలంటూ ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో కరీంనగర్‌ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రియదర్శిని, కేవీకే హెడ్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, ప్రాజెక్టు మేనేజర్‌ రత్నాకర్‌, శాస్త్రవేత్తలు, రైతులు, డీలర్లు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement