‘పారమిత’లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ దినోత్సవం | Sakshi
Sakshi News home page

‘పారమిత’లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ దినోత్సవం

Published Wed, Dec 6 2023 12:12 AM

స్కౌట్స్‌ విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం - Sakshi

కరీంనగర్‌: మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో మంగళవారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ దినోత్సవాన్ని జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రశాంత్‌ పతాకావిష్కరణ చేసి, ప్రారంభించారు. విద్యార్థులు చేసిన కవాతు అందరినీ ఆకర్షించింది. పాఠశాల డైరెక్టర్లు వినోదరావు, హనుమంతరావు విద్యార్థులకు స్కార్ఫ్‌, బ్యాడ్జీలను అందజేశారు. పిల్లల విన్యాసాలు అబ్బురపరిచా యి. పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, కవిత, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యదర్శి రాంరెడ్డి, గైడ్స్‌ కెప్టెన్‌ రజిత, స్కౌట్స్‌ మాస్టర్లు రాజశేఖర్‌, నాగరాజు, శ్రీను నాయక్‌, సమన్వయకర్తలు, టీచర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement