టెండర్లపై విచారణ జరిపించాలి | Sakshi
Sakshi News home page

టెండర్లపై విచారణ జరిపించాలి

Published Fri, Dec 22 2023 1:30 AM

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న రవీందర్‌సింగ్‌  - Sakshi

● మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: సీఎం హామీ నిధుల కింద నగరానికి కేటాయించిన రూ.133 కోట్ల టెండర్‌ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ గురువారం నగరపాలకసంస్థ కమిషనర్‌ శ్రీనివాస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కేవలం ఒక కాంట్రాక్టర్‌కు టెండర్‌ కట్టబెట్టేందుకు రూ.133కోట్ల పనులను నిబంధనలకు విరుద్ధంగా ఒకే ప్యాకేజీ కింద పెట్టారని ఆరోపించారు. కేవలం 60రోజుల్లో రూ.60 కోట్లు పనులు పూర్తి చేసినట్లు బిల్లులు ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బిల్లులు రికార్డ్‌ చేసేందుకు సంతకాలు చేయాలంటూ కిందిస్థాయి అధికారులను ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారని, దీనిపై బుధవారం రాత్రి నగరపాలకసంస్థలో గొడవ కూడా జరిగిందన్నారు. అవినీతి అధికారులను మేయర్‌ సునీల్‌రావు ఎందుకు వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాల్సిన బాధ్యత ముమ్మాటికి అధికారులదేనన్నారు. అందుకే తాను అధికారులపైనే మాట్లాడుతున్నానని, ఎక్కడా మేయర్‌పై వ్యాఖ్యానించలేదన్నారు. తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే, తాను పార్టీకి ఏం వ్యతిరేకం చేశానో చెప్పాలన్నారు.

Advertisement
Advertisement