సృజనాత్మకతను వెలికితీయాలి | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతను వెలికితీయాలి

Published Fri, Dec 22 2023 1:38 AM

ప్రాజెక్ట్‌ను వివరిస్తున్న విద్యార్థి
 - Sakshi

వేములవాడఅర్బన్‌: వేములవాడ మండలం అగ్రహారం ఎస్సారార్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి పాలిటెక్నిక్‌ సృజన టెక్‌ఫెస్ట్‌–2023 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు హాజరై, ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. చీఫ్‌ గెస్ట్‌ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌ జీఎన్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ సృజన టెక్‌ఫెస్ట్‌ వంటి కార్యక్రమాలతో విద్యార్థులలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు పెంపొదుతాయన్నారు. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్‌ రాజగోపాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థులకు ప్రయోగాత్మక జ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రాజెక్ట్‌లను జనవరిలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సృజన టెక్‌ఫెస్ట్‌కి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎలక్ట్రికల్‌ విభాగంలో హుస్నాబాద్‌, టెక్సటైల్‌ విభాగంలో ఆగ్రహారం పాలిటెక్నిక్‌ ప్రాజెక్ట్‌లు ఎంపికై నట్లు తెలిపారు. జిల్లాస్థాయి కో–ఆర్డినేటర్లు శ్రీదేవి, ప్రభాకరాచారి, దశరథం, శ్రీనివాస్‌, కిరణ్‌కుమార్‌, నర్మద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement