అర్హులందరికీ ఆరు గ్యారంటీలు | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఆరు గ్యారంటీలు

Published Sun, Feb 4 2024 11:54 PM

-

తిమ్మాపూర్‌: ఆరు గ్యారంటీలు అర్హులందరికీ అందిస్తామని మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెంలో మాజీ సర్పంచ్‌ మోరపల్లి సుష్మిత–రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఆదివారం సన్మానం ఏర్పాటు చేశా రు. హాజరైన ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కులేదన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అరాచకపాలన సాగించిందని ఆరో పించారు. భూ ఆక్రమణదారులను వదిలిపెట్ట మని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల పొట్టకొట్ట మని, బీఆర్‌ఎస్‌ నాయకుల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 50 రోజులు మాత్రమే అవుతోందని, వందరోజుల్లోగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. జిల్లా అధికా ర ప్రతినిధి ఎల్కపల్లి సంపత్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, రమేశ్‌, యూత్‌ మండల అధ్యక్షుడు చెన్నబోయిన రవి, ఎంపీటీసీ లు కొత్త తిరుపతిరెడ్డి, బండారి రమేశ్‌, నాయకులు కొత్త రాజిరెడ్డి, మండల కో–ఆప్షన్‌ సభ్యు డు తాజొద్దీన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎస్‌ఎ ల్‌.గౌడ్‌, గుంటి మధు, పొట్ట శ్రీనివాస్‌, రావుల కృష్ణ, చింతల లక్ష్మారెడ్డి, గోపు మల్లారెడ్డి, బి.తి రుపతి, లక్ష్మణ్‌, లింగయ్య, హైదర్‌ ఉన్నారు.

‘అవినీతి చైర్మన్‌తో ఇమడలేకే అవిశ్వాసం’

జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్‌ కౌన్సి లర్లు స్థానిక చైర్మన్‌ అవినీతిపై విసుగెత్తి అవి శ్వాసం పెట్టారని కాంగ్రెస్‌ హుజూరాబాద్‌ ని యోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో మాట్లాడుతూ.. జమ్మికుంట కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసంలో ఓడిపోతామనే భయంతో టెక్నికల్‌ సమస్యను సాకుగా చూపి గెలిచారని, కాంగ్రెస్‌పై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతీ కౌన్సిలర్‌కు అండగా ఉంటామని అన్నారు. పార్టీలో కష్టపడ్డవారికి పదవులు ఉంటాయని వెల్లడించారు. సమ్మక్క– సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలి పారు. అర్హులకు దళితబంధు అందించేలా కృషి చేస్తానని వివరించారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి భారీ మోజారిటీ వచ్చేలా కష్టపడాలని పిలుపునిచ్చారు. నాయకులు పత్తి కృష్ణారెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, సుకంరి రమేశ్‌, కసుబోజుల వెంకన్న, పూదరి రేణుక శివకుమార్‌గౌడ్‌, గూడెపు సారంగపాణి, మొలుగూరి సదయ్య, ముద్దమల్ల రవి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

కొన్ని మబ్బులు పుస్తకావిష్కరణ

కరీంనగర్‌కల్చరల్‌: తెలంగాణ రచయితల వేదిక అధ్వర్యంలో కవి విలాసాగరం రవీందర్‌ రచించిన కొన్ని మబ్బులు పుస్తకాన్ని సాహితీవేత్త అవధాని డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు ఆవిష్కరించారు. విలాసాగరం రవీందర్‌ కవితా సంపుటి కొన్ని మబ్బులు పుస్తకంలో మెరుపులే ఎక్కువగా ఉన్నాయన్నారు. మబ్బులు కదలిపోతూ కరిగిపోతాయని, మానవుడూ చలనంలోనే ఉండాలని బోధిస్తాయన్నారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీకుమార్‌, కవులు పొన్నం రవిచంద్ర, దామరకుంట శంకరయ్య, గాజోజు నాగభూషణం, అన్నవర దేవేందర్‌, సంకెపల్లి నాగేంద్రశర్మ, కేవీ.సంతోష్‌బాబు, గుండు రమణయ్య పాల్గొన్నారు.

నేడు బీఆర్‌ఎస్‌ సమావేశం

కరీంనగర్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రేకుర్తిలోని రాజశ్రీగార్డెన్‌లో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుందని, సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రానున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మాజీమంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మేయర్‌ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి హాజరవుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, పార్టీ ప్రజాప్రతినిధులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement