వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా అడుగులు | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా అడుగులు

Published Sun, Feb 4 2024 11:54 PM

-

కరీంనగర్‌టౌన్‌: కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం పదేళ్లుగా శ్రమిస్తున్నారని, వికసిత్‌ భారత్‌ సంకల్పంతో అడుగులు వేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రా జకీయ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజ న సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. పదేళ్ల మోదీ ప్రభుత్వ ఆలోచన విధానాలు, దేశ అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోందని, త్వరలోనే ప్రపంచంలోనే దేశాన్ని మూడోస్థానానికి తీసుకెళ్లేలా ముందుకు సాగుతోందని అన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, అనేక పార్టీలతో ఏర్పాటైన ఇండియా కూటమి విచ్ఛిన్న స్థితిలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ అవినీతి ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ అవినీతి ప్రభుత్వం రావడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ సంపదను నాడు బీఆర్‌ఎస్‌ దోచుకుంటే.. నేడు కాంగ్రెస్‌, రేవంత్‌రెడ్డి సర్కార్‌ దోచుకునే పనిలో ఉందని తెలిపారు. ఏకంగా జాతీయ కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫండింగ్‌ చేసే స్థితిలో ఉందని, రాహుల్‌ యాత్ర కోసం టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ పేరిట కోట్ల విలువ చేసే లగ్జరీ బస్సును ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. దేశంలో అధికారంలోకి రాని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం దండుగన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్‌ పార్లమెంట్‌ ప్రభారీ మీసాల చంద్రయ్య, నాయకులు బోయిన్‌పల్లి ప్రవీణ్‌ రావు, బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి, చెన్నమనేని వికాస్‌ రావు, గండ్ర నళిని, తాళ్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, మాడ వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తరుణ్‌చుగ్‌ను సన్మానించిన సంజయ్‌

కరీంనగర్‌ పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్‌ను ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఘనంగా సన్మానించారు.

అవినీతి బీఆర్‌ఎస్‌ పోయి.. కాంగ్రెస్‌ రూపంలో మళ్లీ అవినీతి వచ్చింది

రాహుల్‌ యాత్రకు రేవంత్‌రెడ్డి రూ.కోట్ల విలువైన బస్సు ఏర్పాటు చేశారు

దేశంలో అధికారంలోకి రాని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు ఓటు దండగ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌

Advertisement
Advertisement