ఉత్తమ పోలీసులకు సేవా పురస్కారాలు | Sakshi
Sakshi News home page

ఉత్తమ పోలీసులకు సేవా పురస్కారాలు

Published Sun, Feb 4 2024 11:54 PM

-

కరీంనగర్‌క్రైం: పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకుందని సీపీ అభిషేక్‌ మహంతి అన్నారు. సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. కమిషనరేట్‌ పరిధిలోని సాయుధ బలగాలకు పదిరోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ శిక్షణలో పరేడ్‌, డ్రిల్‌, ఆయుధాల వినియోగం, ఫైరింగ్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరు ప్లాటూన్లతో కూడిన పరేడ్‌ నిర్వహించారు. కమాండెడ్‌గా ఆర్‌ఐ మోడెం సురేశ్‌ వ్యవహరించారు. శిక్షణలో ప్రతిభ చూపిన వివిధ విభాగాల సిబ్బందికి సీపీ అభిషేక్‌ మహంతి ప్రశంసాపత్రాలు అందించారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలుసేవా పతకాలు ప్రకటించగా.. సీపీ అభిషేక్‌ మహంతి చేతుల మీదుగా అందించారు. వీరిలో కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏఎస్సై సయ్యద్‌ అంజద్‌, వన్‌టౌన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ పి.రవీందర్‌ అతి ఉత్కృష్ఠ సేవా పతకాలు పొందారు. మానకొండూర్‌, కరీంనగర్‌ కానిస్టేబుళ్లు ఏ.తిరుపతి, ఎన్‌.ప్రవీణ్‌కుమార్‌ ఉత్కృష్ఠ సేవా పతకాలు స్వీకరించారు. ఏఎస్సైలు నూరుద్దీన్‌, లక్ష్మారెడ్డి, అబ్దుల్‌ రజాక్‌, గౌస్‌ఖాన్‌, కిషన్‌, దామోదర్‌రావు, మల్లయ్య, గోపాల్‌రెడ్డి, సయ్యద్‌ మొయినొద్దీన్‌, మల్లారెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు సారంగధర, జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌, తిరుపతి, సంపత్‌, తిరుపతి, వీరాస్వామి, శ్రీశైలం, శ్రీనివాస్‌, లింగారెడ్డి, కానిస్టేబుల్‌ చంద్రమౌళి సేవా పురస్కారాలు సీపీ చేతుల మీదుగా అందుకున్నారు డీసీపీలు సి.రాజు(పరిపాలన), లక్ష్మీనారాయణ(శాంతిభద్రతలు), ఏసీపీలు నరేందర్‌, కరుణాకర్‌రావు, జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి

సీపీ అభిషేక్‌ మహంతి

ముగిసిన సాయుధ బలగాల శిక్షణ

ఉత్తమ సేవలందించిన వారికి పతకాలు

Advertisement
Advertisement