అక్షర చిట్‌ఫండ్‌పై కేసు | Sakshi
Sakshi News home page

అక్షర చిట్‌ఫండ్‌పై కేసు

Published Thu, Feb 22 2024 1:36 AM

అక్షర చిట్‌ఫండ్‌ చైర్మన్‌, డైరెక్టర్లను అరెస్టు చేసిన పోలీసులు  - Sakshi

కరీంనగర్‌క్రైం: ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసగించారని బాధితుడి ఫి ర్యాదుతో అక్షర చిట్‌ఫండ్‌ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సీతారాంపూర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి శ్రీరామ్‌ వెంకట్‌రెడ్డి అక్షర చిట్‌ఫండ్‌లో రూ.7లక్షలు చిట్టీ వేశాడు. చిట్టీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు మంగళవారం వన్‌టౌన్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు న మోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.

మోసం చేసిన విధానం ఇలా..

హనుమకొండలోని సుభేదారి, వడ్డేపల్లి ఎక్స్‌రోడ్‌ ఎస్బీహెచ్‌ కాలనీకి చెందిన పేరాల శ్రీనివాసరావు, తిరుపతిరెడ్డి కలిసి అక్షర చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమి టెడ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత తిరుపతి రెడ్డి సంస్థ నుంచి బయటకు వెళ్లిపోగా, శ్రీనివాసరావు భార్య పేరాల శ్రీవిద్య, సూరినేని కొండలరా వు, పుప్పల రాజేందర్‌, అలువాల వరప్రసాద్‌, గోనె రమేశ్‌ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. సంస్థను విస్తరించేందుకు ఏజెంట్లు, మేనేజర్లను నియమిస్తూ క రీంనగర్‌, జగిత్యాల, నిజామాబాద్‌, బోధన్‌, ఆది లాబాద్‌, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, హై దరాబాద్‌, ఖమ్మం, నల్గొండ పట్టణాల్లో 54 బ్రాంచ్‌ల వరకు ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి చిడ్‌ఫండ్‌ రూపంలో వసూలు చేసిన డబ్బును తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలనే దురుద్దేశంతో పలుచోట్ల భూములు కొనుగోలు చేస్తూ వచ్చా రు. గడువు ముగిసినా కస్టమర్లకు డబ్బు చెల్లించకుండా వారిని నమ్మించేందుకు డిపాజిట్‌ చేసిన మొ త్తానికి బాండ్ల రూపంలో ఇస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇట్టి బాండ్లను ఖాతాదారులకు ఇచ్చేందుకు అక్షర టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అక్షర టౌన్‌షిప్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను నెలకొ ల్పారు. ఇలా ఇచ్చినా బాండ్ల గడువు ముగిసినా వా టిని రెన్యూవల్‌ చేస్తూ ఖాతాదారులకు అందిస్తున్నా రు. ఇలా ఏర్పాటు చేసిన సంస్థల్లో కరీంనగర్‌లోని టవర్‌ సర్కిల్‌, మంకమ్మతోట, కోతిరాంపూర్‌, రేకుర్తిలో బ్రాంచీలు ఏర్పాటు చేసి 800 మందిని సభ్యులుగా చేర్చారు. 25 లేదా 50 మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారి నుంచి ప్రతి నెలా డబ్బులు వ సూలు చేస్తూ, చిట్‌ఫండ్‌ యాక్షన్‌ చేస్తూ డివిడెంట్‌ మొత్తాన్ని వారికి సమాన భాగాలుగా పంచుతూ, వచ్చిన మొత్తాన్ని సొంత ఆస్తులు కూడపెట్టుటకు ఉపయోగించారు. గడువు తేదీ ముగిసినా కొంతమంది కస్టమర్లకు డబ్బు ఇవ్వకుండా మోసగించా రు. కస్టమర్లు డిపాజిట్‌ చేసిన డబ్బుతో కరీంనగర్‌లోని వెదిర, వెలిచాలలో 50 ఎకరాల వ్యవసాయ భూమి, నగునూరు శివారు ప్రాంతాల్లో కొంతమంది రైతుల నుంచి భూములు సేకరించారు.

ఆరుగురిపై కేసు.. మగ్గురి అరెస్ట్‌

వన్‌టౌన్‌ పొలీసుస్టేషన్‌లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. హనుమకొండకు చెందిన అక్షర చిట్‌ఫండ్‌ చైర్మన్‌ చీ రాల శ్రీనివాసరావు, హనుమకొండలోని గోపాల్‌పూర్‌కు చెందిన సూరినేని కొండలరావు, కాజీపేటకు చెందిన పుప్పల రాజేందర్‌ను బుధవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. కాగా, గతంలో వీరిపై కరీంనగర్‌ వన్‌టౌన్‌, టూ టౌన్‌, హ నుమకొండలోని సుభేదారి పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు పోలీసు విచారణలో తేలింది.

మోసం చేశారని ఖాతాదారుల ఫిర్యాదు

చైర్మన్‌, డైరెక్టర్లను జైలుకు తరలించిన పోలీసులు

చిట్టీలు వేయించి.. ఆస్తులు కూడగట్టి

Advertisement
Advertisement