పవర్‌కట్‌ ప్రాంతాలు | Sakshi
Sakshi News home page

పవర్‌కట్‌ ప్రాంతాలు

Published Sun, Apr 7 2024 2:05 AM

-

కొత్తపల్లి: కరీంనగర్‌లో విద్యుత్‌ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు 11కేవీ భగత్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని భగత్‌నగర్‌, శివాలయం, పెద్దమ్మగుడి, వెంకటేశ్వరకాలనీ, విఘ్నేశ్వరకాలనీ, ఫకీరువాడ, ఎర్రగుట్ట, వాసుదేవ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1 ఏడీఈ ఎస్‌.నరేందర్‌ తెలిపారు. అదేవిధంగా విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కేవీ ఏపీహెచ్‌బీ ఫీడర్‌ పరిధిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, విట్స్‌ కళాశాల, వారాహ స్వామి ఆలయంతో పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11కేవీ అల్కాపురి ఫీడర్‌ పరిధిలోని హనుమాన్‌నగర్‌, గణేశ్‌నగర్‌ బైపాస్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ పేర్కొన్నారు.

Advertisement
Advertisement