ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published Sun, Apr 7 2024 2:05 AM

కరాటే బెల్టులు సాధించిన విద్యార్థులు - Sakshi

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం ఎలబోతారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు లంక శ్రావణి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఏ రజిత, సీసీ కనుకయ్యలతో పాటు రైతు, హమాలీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరాటే బెల్టులు ప్రదానం

కొత్తపల్లి: ఒకినవా మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లోని వికాస్‌ హైస్కూల్‌ విద్యార్థులకు కరాటే గ్రేడింగ్‌ పోటీలు నిర్వహించి శనివారం బెల్టులు ప్రదానం చేశారు. సుమారు 60 మంది విద్యార్థులకు వివిధ గ్రేడ్‌ల బెల్టులను ఏఎస్సై రాంమూర్తి, బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, అడ్వకేట్స్‌ సుంకె దేవకిషన్‌, జంగ శ్రీనివాస్‌ యాదవ్‌, కరాటే చీఫ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ వసంత్‌ కుమార్‌లు అందజేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ రాచమల్ల శారద శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్‌ బుర్ర ప్రవీణ్‌కుమార్‌, శరత్‌, వైష్ణవి, అనూష, సందీప్‌, వైష్ణవి, నిఖిల్‌, శ్రీనిత, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో

ముగ్గురికి జైలు

కరీంనగర్‌క్రైం: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి కరీంనగర్‌ కోర్టు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ కరీం ఉల్లాఖాన్‌ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 21 మందిని శనివారం కోర్టులో హాజరుపర్చగా ఒకరికి ఏడు రోజులు, ఇద్దరికి ఐదు రోజుల జైలు, రూ.6,500 జరిమానా విధించారన్నారు. మిగిలిన 18 మందికి రూ.31,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు.

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు శ్రావణి
1/1

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు శ్రావణి

Advertisement
Advertisement