Siddaramaiah: సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎం! | Sakshi
Sakshi News home page

Siddaramaiah: సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎం!

Published Wed, May 24 2023 7:33 AM

- - Sakshi

శివాజీనగర: కాంగ్రెస్‌ పార్టీలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లను పార్టీ హైకమాండ్‌ నాలుగురోజుల పాటు ఢిల్లీలో బుజ్జగించి పదవులకు ఎంపిక చేయడం తెలిసిందే. సీఎం పదవిని తలా కొంతకాలం పంచుకునేలా తీర్మానించినట్లు తెలిసింది.

అయితే మంత్రి ఎం.బీ.పాటిల్‌ ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ సిద్దరామయ్య పూర్తికాలం పదవిలో ఉంటారని, అధికార పంపిణీపై ఎలాంటి ఒప్పందం జరగలేదని తెలిపారు. మంత్రి సోమవారం మైసూరులో చేసిన వ్యాఖ్యలను మంగళవారం బెంగళూరులో సమర్థించుకొన్నారు. హైకమాండ్‌ ఇచ్చిన సందేశాన్నే తాను పేర్కొన్నట్లు, అవి వ్యక్తిగత వ్యాఖ్యలు కావని అన్నారు. దీనిపై డీకే వర్గీయులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement