మానసిక ఒత్తిడిలో విద్యార్థులు | Sakshi
Sakshi News home page

మానసిక ఒత్తిడిలో విద్యార్థులు

Published Sun, May 28 2023 2:06 PM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం - Sakshi

మండ్య: మహమ్మారి కోవిడ్‌ తరువాత విద్యార్థులు చదువుతో పాటు ఇతర విషయాల్లో రాణించలేకపోతున్నారని, మానసిక ఇబ్బందులుతున్నారని లోకాయుక్త న్యాయమూర్తి బీఎస్‌ పాటిల్‌ అన్నారు. శనివారం లయన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో మండ్య నగరంలో అంబేడ్కర్‌ భవనంలో నిర్వహించిన ప్రాంతీయ సమ్మేళనాన్ని ప్రారంభించి మాట్లాడుతూ...కరోనా సమయంలో విద్యార్థులు రెండేళ్ల పాటు ఇళ్లల్లోనే గడిపారని, దీంతో విద్యార్థుల్లో ఆందోళన ఉందని, వారిలో ఆత్మస్థైర్యం నింపాలన్నారు.

స్పీకర్‌పై అవహేళనగా పోస్టు

యశవంతపుర: సోషల్‌ మీడియాలో స్పీకర్‌పై అవహేళనగా పోస్టు పెట్టిన చిక్కమగళూరుకు చెందిన శ్రీరామసేన నాయకుడిపై కేసు నమోదు చేశారు. ప్రతేశ్‌ అనే యువకుడు స్పీకర్‌ యూటీ ఖాదర్‌పై సోషల్‌ మీడియాలో అవహేళనగా పోస్టులు పెట్టారు. కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మతతత్వ సంబంధిత కేసు నమోదు చేశారు.

పోలీసులపై దాడి ఇద్దరి అరెస్ట్‌

యశవంతపుర: తాగిన మత్తులో పోలీసులపై దాడి చేసిన ఇద్దరు యువకులను కలబురగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగర బజారు పోలీసుస్టేషన్‌ కానిస్టేబుళ్లు శాంతలింగ, దేవేంద్రలు రాత్రి బీట్‌లో ఉండగా రామమందిరం వద్ద యరగోళ కల్యాణ మంటపం సమీపంలో మద్యం మత్తులో ఉన్న మల్లికార్జున, విజయ్‌లు విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

అబద్ధపు హామీలతో అధికారంలోకి..

యశవంతపుర: విధానసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అనేక చోట్ల ఐదు వేల విలువగల గిఫ్ట్‌ కూపన్లను పంపిణీ చేసినట్లు బీజేపీ ఆరోపించింది. రామనగర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికలకు ముందు ఓటర్లకు ఐదువేల విలువగల కూపన్లు పంపిణీ చేసినట్లు బీజేపీ ట్వీట్‌ చేసింది. కూపన్ల పంపిణీని కాంగ్రెస్‌ నేరుగా ఒప్పుకున్నట్లు బీజేపీ ఆరోపించింది.

అరెస్టయిన నిందితులు
1/1

అరెస్టయిన నిందితులు

Advertisement

తప్పక చదవండి

Advertisement