బాల కార్మిక పద్ధతిని నిర్మూలిద్దాం | Sakshi
Sakshi News home page

బాల కార్మిక పద్ధతిని నిర్మూలిద్దాం

Published Fri, Jun 2 2023 12:10 AM

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం - Sakshi

కోలారు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా న్యాయ సేవల ప్రాధికార సభ్యుడు, సివిల్‌ న్యాయమూర్తి సునీల్‌ ఎస్‌.హొసమని తెలిపారు. గురువారం నగరంలో బాలకార్మిక పద్ధతి నిర్మూలన అభియాన్‌ను ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు గ్యారేజ్‌, హోటల్‌, మటన్‌, చికెన్‌ దుకాణాల్లో పనికి వెళ్లకూడదన్నారు. బాలకార్మికులను గుర్తించి వారిని పాఠశాలలకు తీసుకు రావాలన్నారు, జిల్లా కార్మిక అధికారి శబానా అజ్మీ మాట్లాడుతూ బాల్యావస్థ, కిశోరావస్థల కార్మిక చట్టం–1986 ప్రకారం అన్ని సంస్థల్లో 14 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలను పనిలో పెట్టుకుంటే శిక్షార్హులవుతారన్నారు. అలాంటి వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు, రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా తప్పదని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది శ్రీధర్‌, ప్రిన్సిపాల్‌ శృతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement