స్పందనకు కన్నీటి వీడ్కోలు

10 Aug, 2023 07:24 IST|Sakshi

కర్ణాటక: ప్రముఖ నటుడు విజయ్‌ రాఘవేంద్ర భార్య, నటి స్పందన అంత్యక్రియలు బుధవారం బెంగళూరు నగరంలోని హరిశ్చంద్ర ఘాట్‌లో జరిగాయి. ఆదివారం రాత్రి ఆమె థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌ టూర్‌లో హోటల్‌లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు.

​​​​​​​

ప్రముఖుల సందర్శన
విజయ్‌ రాఘవేంద్ర ఇంటి వద్ద ఉంచి సంప్రదాయాలను పూర్తి చేశారు. ఆమె భౌతికకాయానికి విజయ్‌ పూజలు చేస్తుండగా కుటుంబసభ్యులు బోరుమంటూ విలపించారు. తండ్రి బీకే శివరామ్‌ ఇంటి వద్ద ఉదయం ఆరు గంటల నుంచి జనం సందర్శన కోసం ఉంచారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌లు కుటుంబసమేతంగా అంతిమ దర్శనం చేసుకున్నారు.

అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. స్పందన కొడుకు శౌర్యను పలువురు ఓదార్చారు. సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా తీసుకువచ్చి మల్లేశ్వరం సమీపంలోని హరిశ్చంద్రఘాట్‌లో ఈడిగ కుల సంప్రదాయం ప్రకారం విద్యుత్‌ దహనవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు