ఎడమ కాలువలో గేజ్‌ నిర్వహణకు సూచన | Sakshi
Sakshi News home page

ఎడమ కాలువలో గేజ్‌ నిర్వహణకు సూచన

Published Sat, Sep 2 2023 1:18 AM

బంగారు ఆభరణాలను తిలకిస్తున్న 
మంత్రి బోసురాజు తదితరులు - Sakshi

రాయచూరు రూరల్‌: ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు వీలుగా తుంగభద్ర ఎడమ కాలువలో నీటి గేజ్‌ను నిర్వహించాలని మంత్రి ఎన్‌.ఎస్‌.బోసురాజు సూచించారు. ఆయన శుక్రవారం రంజితా ప్యాలెస్‌లో లక్ష్మయ్య చెట్టి బంగారు నగల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీటి నిర్వహణకు అధికారులు సహకరించి ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. కాలువ పైభాగంలో జరుగుతున్న అక్రమ నీటి చౌర్యాన్ని అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఆపరేషన్‌ హస్త అనే ప్రశ్నే లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన, చేస్తున్న పథకాలతోనే తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు బంగారు ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రుద్రప్ప, శివమూర్తి, జయంతిరావ్‌, నరసింహ నాయక్‌, శాంతప్ప, జ్యూవెలరీ సంచాలకులు నిశాంత్‌, తేజస్‌లున్నారు.

Advertisement
Advertisement