పిల్లలను ప్రపంచ మేధావులుగా తీర్చిదిద్దాలి | Sakshi
Sakshi News home page

పిల్లలను ప్రపంచ మేధావులుగా తీర్చిదిద్దాలి

Published Wed, Sep 6 2023 1:24 AM

ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవంలో సీఎం సిద్దరామయ్య, మంత్రులు - Sakshi

శివాజీనగర: విద్య నేర్పటమే విద్యారంగం ఉద్దేశం కాదని, పిల్లలను ప్రపంచ మేధావులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం నగరంలోని విధానసౌధ బాంక్వెట్‌ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన 43 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసి మాట్లాడారు. డిగ్రీలు, డాక్టరేట్లు పొందినా మూఢ నమ్మకాలను విశ్వసిస్తే వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా పిలవలేమన్నారు. ఈ మాత్రానికి చదువు అవసరం లేదన్నారు. దేశ రాజ్యాంగం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వాతంత్య్ర వచ్చి 76 సంవత్సరాలు గడచినా వందశాతం అక్షరాస్యత సాధ్యపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రిజ్వాన్‌ హర్షద్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రాఽథమిక విద్యాశాఖ మంత్రి ఎస్‌.మధు బంగారప్ప, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎం.సీ.సుధాకర్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

కావేరి బంగ్లాలోకి మారిన సీఎం

బనశంకరి: ప్రభుత్వ నివాసమైన కావేరి బంగ్లాకి సీఎం సిద్దరామయ్య మారారు. కావేరిలో ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో సోమవారం రాత్రి అందులోకి బస మార్చేశారు. ఈ బంగ్లా అదృష్ట నివాసంగా పేరుపొందింది. ఎవరు ఉంటే వారు అధికారం చలాయిస్తారని అంటారు. ఇప్పటివరకు ఆయన శివానంద సర్కిల్‌ వద్ద గత ప్రభుత్వ నివాసంలో ఉండేవారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య, బార్య పార్వతి కావేరి నివాసంలో పూజలు నిర్వహించారు.

సీఎం సిద్దరామయ్య

Advertisement
Advertisement