విశ్వానికి యోగా పరిచయకర్త అయ్యంగార్‌ | Sakshi
Sakshi News home page

విశ్వానికి యోగా పరిచయకర్త అయ్యంగార్‌

Published Sat, Nov 4 2023 1:38 AM

జయంతి కార్యక్రమం నిర్వహించిన దృశ్యం - Sakshi

కోలారు: యోగా గురు బీకేఎస్‌ అయ్యంగార్‌ ద్వారా యావత్‌ ప్రపంచానికి యోగా పరిచయమైందని కాంగ్రెస్‌ నాయకుడు, విధాన పరిషత్‌ మాజీ ఉప సభాపతి వీఆర్‌ సుదర్శన్‌ తెలిపారు. శుక్రవారం బెళ్లూరులో రమామణి సుందరరాజ అయ్యంగార్‌ 96వ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన గ్రామంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించాలనే సంకల్పంతో బెళ్లూరు గ్రామంలో ఉచిత విద్యా సంస్థలను స్థాపించారన్నారు. ఇలాంటి విద్యా సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి తగిన సహకారం అందించాలన్నారు. ఈ ప్రాంతంలో 50కి పైగా గ్రామాల విద్యార్థులకు ఉచిత విద్యాభ్యాసం అందిస్తుండడం సంతోషకరమన్నారు. అయ్యంగార్‌ సంకల్పానికి ఆయన సతీమణి రమామణి అయ్యంగార్‌ కూడా సహకారం అందించారన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్‌ సవితా రఘు, ట్రస్టీ భాష్యం రఘు, అడ్వైజర్‌ అనంతకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement