తాగునీటి ఎద్దడిపై పారాహుషార్‌ | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడిపై పారాహుషార్‌

Published Thu, Nov 9 2023 1:06 AM

మాట్లాడుతున్న జిల్లాధికారి దివాకర్‌  - Sakshi

హొసపేటె: జిల్లాలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాధికారి దివాకర్‌ సూచించారు. ఆయన బుధవారం కరువు పరిస్థితులపై హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి, కొట్టూరు తాలూకా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గ్రామంలోని అన్ని నీటి ట్యాంకులను తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలన్నారు. గ్రామాల్లోని డ్రెయిన్లను వెంటనే శుభ్రం చేయాలన్నారు. వీధి దీపాలు వెంటనే మరమ్మతు చేయాలన్నారు, ఆర్‌ఓ యూనిట్లు చెడిపోతే అదే రోజు మరమ్మతు చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల్లో పశుగ్రాసం కొరత నివారణ, సాగునీరు అందే ప్రాంతాల్లో పశుగ్రాసం రాకుండా నిరోధించడం, ఉపాధి హామీ, అన్ని జాబ్‌కార్డుల్లో పనులు, ఎక్కువ పనులు చేపట్టడం, చేతితోట, పాఠశాలల్లో కాంపౌండ్‌, మరుగుదొడ్లు, ఇతర పనులు ఈ ఏడాది తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు మందుల నిల్వలు ఉంచాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో మనె బాగిలిగె ఈ సొత్తు అనే ప్రచారాన్ని ఇంటింటికీ వెళ్లి 30 రోజుల్లోగా నివేదించాలని సూచించారు. ఈసందర్భంగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement