అంబేడ్కర్‌ సర్కిల్‌ను ఆధునీకరించరూ.. | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ సర్కిల్‌ను ఆధునీకరించరూ..

Published Thu, Nov 9 2023 1:06 AM

అధికారికి వినతిపత్రాన్ని అందిస్తున్న 
ఎస్సీ, ఎస్టీ వర్గాల సమాఖ్య సభ్యులు  - Sakshi

కంప్లి: పట్టణం నడిబొడ్డులోని అంబేడ్కర్‌ సర్కిల్‌ చుట్టు గల ఫుట్‌పాత్‌ను తొలగించి సర్కిల్‌ను ఆధునీకరించాలని ఒత్తిడి చేస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాల సమాఖ్య బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌లో ధర్నా చేసింది. ఈసందర్భంగా సమాఖ్య ప్రముఖులు మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలతో సర్కిల్‌ వద్ద అమర్చిన గ్రిల్స్‌ పదేపదే విరిగిపోయి సర్కిల్‌కు కూడా హాని జరుగుతోందన్నారు. అందువల్ల ప్రభుత్వం, మున్సిపాల్టీ సొమ్ము వృథా అవుతుందే తప్ప ప్రజల భావనలకు తగిన పరిష్కారం దొరకడం లేదన్నారు. 32 ఎంఎం ఇనుప రాడ్లతో కొత్తగా సర్కిల్‌ చుట్టు గ్రిల్స్‌ నిర్మించాలని, సర్కిల్‌ చుట్టు రాజకీయ పార్టీల బ్యానర్లు కట్టడాన్ని అరికట్టాలన్నారు. రమేష్‌ హూగార్‌, జే.నాగరాజ్‌, బీ.నాగేంద్ర, సీఆర్‌.హనుమంత, జీ.రామణ్ణ, శ్రీనివాస్‌, విరుపాక్షి, యూ.జిలాన్‌, భగవాన్‌ సింగ్‌ తదితరులు ఈసందర్భంగా పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement