Sakshi News home page

ఆస్తుల విలువల్లో జయనగర టాప్‌

Published Sat, Nov 11 2023 1:22 AM

-

బనశంకరి: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఇటీవల నిర్దేశంచిన ఆస్తుల విలువలో బెంగళూరులోని జయనగర రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా తేలింది. వాణిజ్య అవసరాలకు కేటాయించిన స్థలాలకు సంబంధించి జయనగర మూడోబ్లాక్‌ కాస్మోపాలిటన్‌ క్లబ్‌ సర్కిల్‌ నుంచి 11వ మెయిన్‌ రోడ్డు వరకు ప్రతి చదరపు మీటరుకు రూ.5.36 లక్షలు, జయనగర 4వ బ్లాక్‌ 30వ క్రాస్‌ 4వ మెయిన్‌రోడ్డు నుంచి దయానందకాలేజీ వరకు చదరపు మీటరుకు రూ.5.03 లక్షలు, 27వ రోడ్డులో చదరపు మీటరుకు రూ.5,03,500, జయనగర 5వ బ్లాక్‌ 40వ రోడ్డులో చదరపు మీటరు కు రూ.4.39 లక్షలుగా నిర్ణయించారు. ఇది మార్కెట్‌ విలువ మాత్రమే. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ 30శాతానికిపైగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ శాఖ లెక్కల ప్రకారం 30 40 సైటు ధర రూ.6 కోట్లు కాగా బహిరంగ మార్కెట్‌లో రూ.10 కోట్లకు పైగా ఉంటుందని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు తెలిపారు.

అత్యాధునిక సదుపాయాలు

రాష్ట్రంలోనే జయనగరలో ధరలు అధికంగా పలకడానికి అనేక కారణాలు ఉన్నాయి. విశాలమైన రోడ్లు, పార్కులు, ఆసుపత్రులు, గ్రంథాలయాలతో పాటు పచ్చదనంతో కూడుకుని ఉంది. ఇక్కడ శ్రీమంతులు ఎక్కువగా స్థిరపడ్డారు. వాణిజ్య అవసరాలకోసం ఏర్పాటుచేసిన సైట్లలో పెద్దపెద్ద బ్రాండెడ్‌ కంపెనీల మాల్స్‌ వెలిశాయి. దీంతో ఇక్కడ ఆస్తివిలువ ఏటా పెరుగుతోంది.

మైసూరు సంస్థాన జ్ఞాపకార్థం

1940లో మైసూరు మహారాజుగా ఉన్న జయచామరాజేంద్ర ఒడియార్‌ రాజుగా పట్టాభిషిక్తుడైన 8 ఏళ్ల తర్వాత పరిపాలన విజయవంతంగా పూర్తిచేసినందుకు జ్ఞాపకంగా 1948లో జయనగర లేఔట్‌ కు పునాది వేశారు.సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్ట్‌బోర్డు(సీఇటీవీ) ప్రాధికార ఏర్పాటుచేసి అధ్యక్షుడిగా సీ.నరసింగరావ్‌, చీఫ్‌ ఇంజినీర్‌గా ఆర్‌.మాధవన్‌ను నియమించారు.

రాష్ట్రంలోనే ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు

మైసూరు రాజులతో పునాది పడిన కాలనీ

విశాలమైన రహదారులు

30 40 సైటు ధర అంచనా రూ.8 కోట్లు

అధిక ఆస్తివిలువ కలిగిన ప్రదేశాలు (చదరపు మీటరు ధర లక్షల్లో)

కోరమంగల రింగ్‌రోడ్డు రూ.1,06,600

మారేనహళ్లి 100 ఫీట్‌రోడ్డు వాణిజ్యసైట్‌ రూ.3,65,900

మల్లేశ్వరం 5 నుంచి 12వ మెయిన్‌రోడ్డు వరకు రూ.1,95,000

అవెన్యూమెయిన్‌రోడ్డు రూ.2,69,125

కెంపేగౌడరోడ్డు రూ.3,36,375

గాంధీనగరలో రూ.2 లక్షలు

కన్నింగ్‌హ్యాంరోడ్డు రూ.3,62,180

చర్చ్‌స్ట్రీట్‌ రూ.2,30,00

కమర్షియల్‌స్ట్రీట్‌ రూ.3,19,000

కన్నింగ్‌హ్యామ్‌రోడ్డు ఎస్‌ఆర్‌టీ రూ.3,22,000

ఎంజీరోడ్డునుంచి హలసూరు వరకు,డికెన్సన్‌రోడ్డు రూ.1.81,500

Advertisement

What’s your opinion

Advertisement