కాంగ్రెస్‌ సర్కారులో కలహాలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సర్కారులో కలహాలు

Published Wed, Nov 15 2023 12:16 AM

-

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

హుబ్లీ: డీకే.శివకుమార్‌ మరో పవర్‌ సెంటర్‌ కాకూడదనే కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయని, వారి ఘర్షణతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమైందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. నగరంలోని తమ కార్యాలయంలో లక్ష్మీపూజ నెరవేర్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతికూల ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. గ్రామాలకు, రైతులకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా కావడం లేదన్నారు. తీవ్రమైన అంతర్గత కలహాలతో పాలనా యంత్రాంగం పూర్తిగా నాశనమైందన్నారు. జాతీయ నేతలతో చర్చించి త్వరలోనే ఉభయ సభల్లో విపక్ష(బీజేపీ) నేతలను ఎన్నుకుంటామన్నారు. ప్రభుత్వ నిర్వీర్యత, వైఫల్యాలపై పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని, బదిలీల్లో అది తాండవించిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు. 6 నెలల్లో ఇంతటి స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుందని తాము కూడా అనుకోలేదన్నారు.

ఊళ్లోకి వచ్చి ఏనుగు ప్రసవం

మైసూరు: అడవి ఏనుగు ఒకటి ఊరిలోకి వచ్చి ప్రసవించింది. ఈ అరుదైన సంఘటన కొడగు జిల్లా మడికెరి నగరం దగ్గర కరడ గ్రామంలో జరిగింది. కీమలె అడవికి దగ్గరగా ఉన్న మోణ్ణ కుట్టడ మంజ అనే వ్యక్తి ఇంటి ముందుకు ఒక అడవి ఏనుగు వచ్చి పిల్లకు జన్మనిచ్చింది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు తల్లీ పిల్ల ఏనుగును ఆసక్తిగా వీక్షించారు. తరువాత అటవీ సిబ్బంది తల్లీ పిల్ల ఏనుగును అడవిలోకి మళ్లించారు.

Advertisement
Advertisement