నేత్రపర్వం.. మహదేశ్వర రథోత్సవం | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. మహదేశ్వర రథోత్సవం

Published Wed, Nov 15 2023 12:16 AM

మంగళవారం ఉదయం తేరు ఉత్సవం సందోహం  - Sakshi

మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలో మలెమహాదేశ్వర కొండపై వెలసిన మహదేశ్వర దేవస్థానంలో మాదప్ప రథోత్సవం కన్నుల పండువగా వేలాది భక్తజనం మధ్య జరిగింది. దీపావళి పర్వదినం సందర్భంగా స్వామివారికి తేరు ఉత్సవం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వివిధ పూజలు, హోమాలు నిర్వహించి ఉదయం సుమారు 8.40 గంటలకు శుభ ముహూర్తంలో స్వామి నామాన్ని జపిస్తూ మహేదేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని ప్రతిష్టాపన చేసి వేలాది మంది తేరును లాగారు. సాలూరు మఠానికి చెందిన శ్రీశాంతమల్లికార్జున స్వామి పూజా కార్యక్రమాలను నిర్వర్తించారు. పొరుగున ఉన్న కేరళ, తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. దేవాలయం మొత్తం రంగు రంగుల జెండాలతో అలంకరించారు.

హాజరైన అశేష భక్తజన సంద్రం
1/2

హాజరైన అశేష భక్తజన సంద్రం

స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు
2/2

స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

Advertisement
Advertisement