దురలవాట్లతో అనారోగ్యమే

19 Nov, 2023 00:14 IST|Sakshi
ఎమ్మెల్యే మహేష్‌ టెంగినకాయితో క్రికెట్‌ క్రీడాకారులు

హొసపేటె: ధూమపానం, మద్యం, పొగాకు వినియోగం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. యువకులు, విద్యార్థులు ఈ దురలవాట్లకు దూరంగా ఉండాలని ప్రముఖ గుండైవెద్య నిపుణుడు బొమ్మ గురురాజ్‌ అన్నారు. హొసపేటెలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల సిబ్బందికి, వారి కుటుంబాలకు ఉచిత గుండె పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. ధ్యానం యోగా చేయడం వల్ల బీపీ, మధుమేహం రావు. జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల ఆరోగ్య దెబ్బతింటుంది. మాంసం తరచుగా తినకూడదు. పండ్లను ఎక్కువగా తినాలని తెలిపారు. ప్రిన్సిపాల్‌ కె.శివప్ప, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భారత్‌ విజయం ఖాయం

హుబ్లీ: ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌లో భారత్‌ గెలుపు సాధించాలంటు స్థానిక ఎమ్మెల్యే మహేష్‌ టెంగినకాయి శుభాబివందనములు తెలిపారు. శనివారం స్థానిక నెహ్రూ మైదానంలో అభిమానులతో కలిసి క్రికెట్‌ ఆడటం ద్వారా భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. ఆదివారం ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇండియా గెలుపు సాధించాలని ఆకాంక్షిస్తూ భారత్‌జట్టుకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు