దళారుల చేతిలో ఉల్లి రైతు విలవిల | Sakshi
Sakshi News home page

దళారుల చేతిలో ఉల్లి రైతు విలవిల

Published Mon, Nov 20 2023 12:26 AM

మార్కెట్‌లో నిల్వ ఉన్న ఉల్లిగడ్డలు  - Sakshi

రాయచూరు రూరల్‌: పంట పండించిన రైతులు దళారుల చేతిలో నలిగి విలవిలలాడుతున్నారు. ఏపీఎంసీకి రైతులు తాము పండించిన పంటలను తెచ్చినా కొనుగోలు చేయకుండా దుకాణాల యజమానులు చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు తెచ్చిన ఉల్లిగడ్డలను ఏపీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేయక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఏపీఎంసీ అధికారులు ఉల్లిగడ్డల కొనుగోలుకు ముందుకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి రాయచూరు ఏపీఎంసీకి ఉల్లిగడ్డలు వస్తున్నాయి. బస్తా ధర రూ.4400లుగా నిర్ణయించారు. జిల్లాలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. జిల్లాలో 800 హెక్టార్లలో ఉల్లి పంటను పండించారు. మద్దతు ధరలు ప్రకటించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాయచూరు ఏపీఎంసీలో రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలను అధిక ధరకు విక్రయించడం కోసం వ్యాపారస్తులు గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులకు లారీల్లో తరలిస్తున్నారు. గతంలో రైతులు ఉల్లిని తక్కువ ధరకు విక్రయించారు. నేడు ధర మూడింతలు పెరగడంతో కొనుగోలుదారులు దిక్కులు చూస్తున్నారు.

Advertisement
Advertisement