ఘోరంపై జవాబు ఇవ్వండి | Sakshi
Sakshi News home page

ఘోరంపై జవాబు ఇవ్వండి

Published Thu, Nov 23 2023 12:48 AM

కరెంటు తీగను తొక్కి మంటల్లో కాలిపోతున్న 
తల్లీకూతురు(ఫైల్‌)  - Sakshi

బనశంకరి: కరెంటు తీగ తగిలి మృతిచెందిన తల్లి తనయ దుర్ఘటనలో లోకాయుక్త సుమోటోగా కేసు నమోదుచేసి ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శితో పాటు 7 మంది అధికారులకు నోటీసులు జారీచేసింది. గత ఆదివారం ఉదయం మహదేవపురలో హోప్‌ఫాం వద్ద సౌందర్య అనే మహిళ కూతురుని ఎత్తుకుని వెళ్తూ తీగను తొక్కి మరణించడం తెలిసిందే. రాజ్యాంగం నిబంధనల ప్రకారం సురక్షిత వాతావరణం ప్రజలు జీవించేలా చూడడం ప్రభుత్వ అధికారుల బాధ్యత అని, విద్యుత్‌ వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోవడానికి అధికారులే బాధ్యత వహించాలని, ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి సమగ్ర దర్యాప్తు అవసరం ఉందని లోకాయుక్త పేర్కొంది. ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, బెస్కాం ఎండీ, నగర ఉత్తర వలయ బెస్కాం ఇంజినీర్‌, ఉత్తర వలయ ఎస్‌ఈ, వైట్‌ఫీల్డ్‌ ఈఈ, కిందిస్థాయి ఇంజినీర్లకు నోటీసులు జారీచేసి డిసెంబరు 8 తేదీలోగా ఈ ప్రమాదం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

విద్యుత్‌శాఖ పెద్దలకు

లోకాయుక్త తాఖీదు

Advertisement
Advertisement