ఘనంగా ధర్మవరం రామకృష్ణమాచార్య జయంతి | Sakshi
Sakshi News home page

ఘనంగా ధర్మవరం రామకృష్ణమాచార్య జయంతి

Published Thu, Nov 23 2023 12:48 AM

-

బళ్లారిఅర్బన్‌: స్థానిక రాఘవ కళామందిరంలో బుధవారం సాయంత్రం బళ్లారి రాఘవ మెమోరియల్‌ అసోసియేషన్‌, డీఆర్‌కే రంగసిరి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ధర్మవరం రామకృష్ణమాచార్యుల 171వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్‌ మంజునాథ్‌, విమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేష్‌ అధ్యక్షతన జయంతిని ప్రారంభించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులపై కసాప మాజీ అధ్యక్షుడు సిద్దరామ కల్మట్‌ ఉపన్యాసం చేశారు. బళ్లారికి చెందిన రంగస్థల కళాకారుడు శివరుద్రయ్య స్వామికి వేషభూషణ డీఆర్‌కే రంగసిరి పురస్కారం అందించారు. బయలాట కళాకారుడు ముద్దటనూరు తిప్పేస్వామి, దాసవాణి సుగమ సంగీత పండిత్‌ రాఘవేంద్ర గుడదూరు, సంగీత విద్వాంసుడు బీ.కాసింవలి, విజయ్‌కుమార్‌, తబల హర్షాచారి, విష్ణు హడపద తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement