బొగ్గు అక్రమ నిల్వలపై చర్యలేవీ? | Sakshi
Sakshi News home page

బొగ్గు అక్రమ నిల్వలపై చర్యలేవీ?

Published Thu, Nov 23 2023 12:48 AM

-

రాయచూరు రూరల్‌: ఆర్టీపీఎస్‌, వైటీపీఎస్‌ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించే బొగ్గును అక్రమంగా నిల్వ ఉంచిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని అంబేడ్కర్‌ దళిత సేన డిమాండ్‌ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు కృష్ణ మాట్లాడారు. అధికారులతో చేతులు కలిపి అక్రమంగా రూ.4 లక్షల విలువ చేసే బొగ్గును అక్రమంగా నిల్వ ఉంచిన కాంట్రాక్టర్‌, అధికారులపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

సంతకాల సేకరణ

రాయచూరు రూరల్‌: దేశ వ్యాప్తంగా నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలు కావాలని సంతకాల సేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా దాదాపు 1540 మంది విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement